విజయనగరం: స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నవేళ ఆంధప్రదేశ్‌లో శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. 1927లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన గాంధీ..అనేక రోజులు ఇక్కడి ప్రజల్ని కలుస్తూ స్వాతంత్య్ర పోరాటం, ఖాదీ, స్వదేశీ వస్తువుల వాడకంపై చైతన్యం నింపారు. దాదాపు 100 ఏండ్ల తర్వాత కూడా ఇక్కడి ప్రజలు మహాత్మాగాంధీ అనాటి సందేశాన్ని ఇంకా స్మరించుకుంటున్నారు.
మహాత్ముడి సందేశాన్ని తరువాతి తరానికి అందించాలనే లక్ష్యంతో గాంధీ మందిరాన్ని అభివృద్ధి చేశారు. 50 ఎకరాలతో విస్తరించిన ఉద్యానవనంలో గాంధీ ఆలయాన్ని కట్టుకున్నారు. అలాగే స్ఫూర్తివనంలో 35 మంది స్వాతంత్య్ర సమరయోధులు, ఐదుగురు సంఘ సంస్కర్తల విగ్రహాలు కూడా ఉన్నాయి.