ముంబై : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తన సొంత గ్రామం సంతుక్ పింపి గ్రామంలో శనివారం స్కూల్ ఠీక్ కరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్.. జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. ‘స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు అవుతున్నా స్కూళ్లకు సరైన నీటి సరఫరా కూడా లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను వెంటనే నియంత్రించాలి. ఒక్కో విద్యార్థికి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. గత పదేండ్లలో 94వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. పేదలకు విద్యఎలా అందుతుంది’ అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌ను తగ్గిస్తున్నదని.. అందుకే సరైన వసతులు ఉండట్లేదని అభిజీత్ ఆరోపించారు.కేవలం స్కూళ్ల వరకే పరిమితం కాకుండా ఇక నుంచి ప్రభుత్వ దవాఖానల్లోనూ వసతులపై ప్రశ్నిస్తామని అభిజీత్ దీప్కే చెప్పారు.
అంతకు ముందు అభిజీత్ ఎక్స్‌లో ఒక సంచలన ట్వీట్ చేశారు. తమ సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను కూడా పంచుకున్నారు. కానీ తర్వాత తమ ఖాతాను పొందగలిగామని చెప్పారు.