చండీగఢ్: హెయిర్‌కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. (Students Murder School Principal) కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణిమ రోజున ఇది జరుగడం కలకలం రేపింది. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాస్ బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా 50 ఏళ్ల జగ్బీర్ సింగ్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఆయన మందలించారు. హెయిర్ కట్ చేయించుకోవాలని, దుస్తులు సరిగ్గా ధరించాలని, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఆ ఇద్దరు విద్యార్థులను గతంలో చాలాసార్లు మందలించిన విషయాన్ని గుర్తుచేశారు.
కాగా, ఆగ్రహించిన ఆ విద్యార్థులు మడిచే కత్తితో ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్‌పై దాడి చేశారు. ఆయనను పలుమార్లు పొడిచారు. కత్తిని అక్కడ విసిరేసి స్కూల్ నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ అక్కడ కుప్పకూలిపోయారు. ఇది చూసి టీచర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు. వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్‌ను కత్తితో పొడిచిన తర్వాత ఆ విద్యార్థులు అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించారు. మైనర్ విద్యార్థులను ఇంకా అదుపులోకి తీసుకోలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణిమ రోజున ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
Also Read:
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
sinkhole on Nagpur bridge | ప్రారంభించక ముందే.. వంతెనపై భారీ గొయ్యి, గుంతలమయం
Delhi Double Murder | మహిళ, పసిపాప నోటికి టేప్ వేసి.. గొంతులు కోసి హత్య చేసిన వ్యక్తి