న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న మహిళ, పసిపాపను ఒక వక్తి దారుణంగా హత్య చేశాడు. మహిళ అరుపు, చిన్నారి ఏడ్పు వినపించకుండా నోటికి టేప్ వేశాడు. సర్జికల్ బ్లేడ్‌తో గొంతులు కోసి వారిని చంపాడు. (Delhi Double Murder) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 2023లో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల నిఖిల్, 22 ఏళ్ల సోనాల్ మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేశారు.
కాగా, పెళ్లి కాకుండానే సోనాల్ గర్భం దాల్చింది. అబార్షన్ ప్రయత్నం ఫలించకపోవడంతో 2024లో బాబుకు ఆమె జన్మనిచ్చింది. అయితే అల్మోరాలోని ఒక గుర్తు తెలియని వ్యక్తికి రూ. 2 లక్షలకు బాబును అమ్మేశారు. ఆ డబ్బుతో ఢిల్లీ చేరుకున్నారు. తొలుత వజీరాబాద్‌లో నివసించిన ఈ జంట తర్వాత మజ్ను కా తిల్లా ప్రాంతానికి మారి అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
మరోవైపు స్థానికంగా నివసించే రష్మితో సోనాల్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె ఇంటికి తరచుగా వెళ్లేంది. అయితే నిఖిల్‌తో గొడవ నేపథ్యంలో కొన్ని రోజులుగా రష్మి ఇంట్లో ఆమె ఉంటున్నది. దీంతో రష్మి భర్త దుర్గేష్, సోనాల్ మధ్య సంబంధం ఉందని నిఖిల్ అనుమానించాడు. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్‌ను పలుసార్లు పరిశీలించాడు.
కాగా, సోనాల్ మరోసారి గర్భం దాల్చింది. ఈసారి బిడ్డను కనాలని, ఇద్దరం స్థిరపడదామని ఆమెతో నిఖిల్ చెప్పాడు. అయితే అతడికి తెలియకుండానే అబార్షన్ చేయించుకున్నది. దుర్గేష్ ప్రోత్సాహంతో సోనాల్ ఇలా చేసిందని నిఖిల్ అనుమానించాడు. ఆమె తిరిగి ఇంటికి రావాలని ఒప్పించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు జూలై 9న పెద్ద కుమార్తెను ఇంటికి తెచ్చేందుకు రష్మి, దుర్గేష్ కలిసి స్కూల్‌కు వెళ్లారు. వారి ఆరు నెలల రెండో కూతురు, సోనాల్ ఆ ఇంట్లో ఉన్నారు. నిఖిల్ అక్కడకు చేరుకుని సోనాల్‌తో గొడవపడ్డాడు. వెంటతెచ్చిన సర్జికల్ బ్లేడ్‌తో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అరుపులు బయటకు వినిపించకుండా సోనాల్ నోటికి టేప్ వేశాడు.
కాగా, ఆ తర్వాత ఇంట్లో ఉన్న చిన్నారిని నిఖిల్ చూశాడు. సోనాల్ అబార్షన్ చేయించుకోవడంతో తనకు బిడ్డ పుట్టలేదన్న కక్షతో ఆ పసిపాపను కూడా గొంతుకోసి హత్య చేశాడు. బిడ్డ ఏడ్పు వినిపించకుండా నోటికి టేప్ వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు పెద్ద కుమార్తెతో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన రష్మి, దుర్గేష్ దంపతులు ఇది చూసి షాక్ అయ్యారు. తమ బిడ్డను, సోనాల్‌ను గొంతుకోసి హత్య చేయడంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఖిల్ కోసం పోలీసులు వెతికారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి అతడు పారిపోయినట్లు తెలుసుకున్నారు.
పోలీస్ బృందం అక్కడకు వెళ్లి నిఖిల్‌ను అరెస్ట్ చేసింది. అతడ్ని ప్రశ్నించగా జరిగింది చెప్పి నేరం ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. మహిళ, పసిపాప జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
3 Men Rape Woman | మహిళపై ముగ్గురు అత్యాచారం.. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ చోరీ
Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్