కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 28: జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్ మైదానంలో ‘వందన్’ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. కొండగట్టు జేఎన్టీయూహెచ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే శ్రీనివాస్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్‌తో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా సాధన చేయాలన్నారు. తద్వారా విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ వహించి ఉన్నతమైనస్థానాల్లో స్థిరపడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల ప్రదర్శనలు, సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.