Messi – Yamal : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్‌కు ఒక్కరోజే ఉంది. దాంతో, లీగ్ దశనుంచి నిలకడగా రాణించిన స్పెయిన్(Spain), తడబడినా అనూహ్యంగా పుంజుకున్న అర్జెంటీనా(Argentina).. ఈ రెండింటిలో ట్రోఫీని ముద్దాడేది ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఇంతలోనే సాకర్ అభిమానులను ఆలోచనల్లో పడేసింది 18 ఏళ్లనాటి బాత్ టబ్ ఫొటో. అందులో 20 ఏళ్ల యువకుడిలా లియోనల్ మెస్సీ (Lionel Messi) లాలించిన నెలల పిల్లాడు లమినె యమల్(Lamine Yamal). వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు. ఇంకేముంది.. ఇప్పుడా ఫొటో కేంద్రంగా మీమ్స్ పుట్టుకొచ్చాయి. సాకర్ అట గురించే తెలియని కుటుంబంలో జన్మించిన యమల్.. అప్పుడప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న మెస్సీలు ఆ ఫొటోషూట్‌లో ఎలా భాగమయ్యారంటే..?
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఆదివారం స్పెయిన్, అర్జెంటీనా తలపడనున్నాయి. స్పెయిన్‌కు లమినె యమల్ ఎంత కీలకమో, డిఫెండింగ్ ఛాంపియన్‌కు లియోనల్ మెస్సీ అంతే కీలకం. సో.. టైటిల్ పోరులో ఇరువురి మధ్య గోల్ పోరు అలరించం ఖాయం. అయితే.. 18 ఏళ్ల క్రితం బాత్ టబ్ ఫొటోలో యమల్‌ను ఆడించిన మెస్సీ.. ఆ పిల్లాడే వరల్డ్‌కప్ ఫైనల్లో తనకు ప్యత్యర్థి అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు.
ఇదే విషయమై ‘ది ఫంటాస్టిక్స్ ఫెస్ట్’ ఈవెంట్లో ప్రశ్నించగా.. ‘యమల్ నిజంగా అద్భుతం. నేను ఆడిన క్లబ్‌కే అతడు ఆడుతున్నాడు. కాబట్టి అతడి ఆటను గమనిస్తున్నా. చిన్నవయసులోనే చరిత్ర సృష్టించే విజయం సాధించే అవకాశం అతడికి వచ్చింది. అయితే.. మేము ఈసారి అది జరగకుండా అడ్డుకుంటాం. ఫైనల్లో మేము బాగా ఆడాలనుకుంటున్నాం. అదే సమయంలో యమల్, అతడి జట్టు మంచిగా ఆడొద్దని’ కోరుకుంటున్నా అని మెస్సీ బదులిచ్చాడు.
అది 2007. ఓరోజు స్పానిష్ స్పోర్ట్స్ వార్తాపత్రిక, యూనిసెఫ్(UNICEF)సంస్థ విరాళాల సేకరణలో భాగంగా క్యాలెండర్‌కు ప్రకటన ఇచ్చాయి. చిన్నపిల్లలను బార్సిలోనా(Barcelona) క్లబ్ ఆటగాళ్లు ఎత్తుకొని ఫొటోలు దిగుతారని వార్త ప్రచురించారు. అప్పటికి యమల్‌కు ఐదు నెలలంతే. ఆ వార్త చదివిన చాలామందిలానే యమల్ తల్లిదండ్రులు అతడి పేరు ఇచ్చారు. అయితే.. ఈ ఫొటోషూట్ కోసం పిల్లలను క్రమపద్ధతిలో ఎంచుకోలేదు. దాంతో అదృష్టవశాత్తూ యమల్‌కు అవకాశం దక్కింది. అదేంటోగానీ.. బార్సీలోనా క్లబ్‌కు ఆడుతున్న 20 ఏళ్ల మెస్సీ ఆ ఫొటోషూట్‌కు వెళ్లాల్సి వచ్చింది.
𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 𝗕𝗲𝗵𝗶𝗻𝗱 𝗠𝗲𝘀𝘀𝗶-𝗬𝗮𝗺𝗮𝗹 𝗣𝗵𝗼𝘁𝗼𝘀𝗵𝗼𝗼𝘁:
Many people have wondered how five-month-old Lamine Yamal, born into an ordinary, working-class family with no influential football connections, ended up in a photoshoot with Lionel Messi.
The answer is… pic.twitter.com/FyXV6ESdp5
— Dr Ahmad Rehan Khan (@AhmadRehanKhan) July 16, 2026
క్యాంప్ నౌలో బార్సిలోనా ఆటగాళ్లు, ఎంపిక చేసిన పిల్లలను ఆడిస్తూ ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే యమల్‌ను బాత్ టబ్‌లో మెస్సీ ఆడిస్తుండగా జొహన్ మొన్ఫోర్ట్(Joan Monfort) అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. పక్కనే యమల్ తల్లి షీల(Sheila) ఉన్నారు. ఆ ఫొటోషూట్ కారణంగా యూనిసెఫ్‌కు నిధులు సమకూరాయి. కట్ చేస్తే.. 18 ఏళ్లకు ఆ ఫొటో ఫిఫా వరల్డ్‌కప్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారింది. అప్పుడు తాను ఆడించిన పిల్లాడు పెద్దవాడే.. తనతో ప్రత్యర్థిగా ఫైనల్‌కు సిద్ధమవుతుండడం మెస్సీని అవాక్కయ్యేలా చేస్తోంది.
Yes, those photos you’ve seen are real.
More than 18 years ago, a baby named Lamine Yamal and his mom Sheila met Lionel Messi at a UNICEF fundraising photoshoot.
Today, their achievements on the pitch inspire millions. Off the pitch, both Messi and Lamine Yamal use their voices… pic.twitter.com/TSoUPDxia2
— UNICEF (@UNICEF) July 16, 2026
ప్రపంచకప్‌లో యమల్ ఒక్క గోల్ చేశాడంతే. అది కూడా గ్రూప్ దశలో సౌదీ అరేబియాపై. అలాఅనీ మనోడిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే బంతి దొరికిందంటే ప్రత్యర్థి డిఫెండర్లను ఏమారుస్తూ గోల్ పోస్ట్‌వైపు దూసుకెళ్లడంలో నేర్పరి యమల్. పైగా.. వేగం, చురుకుదనం అతడి అదనపు బలాలు. టీనేజ్ సంచలనంగా స్పెయిన్ జట్టులోకి దూసుకొచ్చిన యమల్ జెర్సీ నంబర్ సైతం.. 10 కావడం విశేషం. ఓవైపు పాతికేళ్లకుపైగా అనుభవజ్ఞుడైన మెస్సీ.. మరోవైపు కెరీర్లో తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న యమల్ మధ్య పోటీని తలచుకుంటునే థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది కదా.!