పాట్నా: ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Janaki Devi) బీహార్లోని బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషహ గ్రామంలో నివసించే మున్నీలాల్ ఇంట్లోకి ఒక భారీ నాగుపాము చొరపబడింది. దానిని చూసి ఆ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇది తెలుసుకుని స్థానికులు ఆ ఇంటి ముందు గుమిగూడారు.
కాగా, వాల్మీకినగర్ ప్రాంతానికి చెందిన జానకి దేవి, విషపూరిత పాములను పట్టుకుని రక్షించడంలో పేరు గాంచింది. సర్ప స్నేహితురాలిగా ప్రసిద్ధి చెందిన ఆమె గత కొన్నేళ్లుగా సుమారు 2,000 పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టింది. విషహ గ్రామంలోని ఒక ఇంట్లో నాగుపాము చొరబడినట్లు జానకి దేవికి తెలిసింది. దీంతో ఆమె అక్కడకు చేరుకుని ఆ పామును పట్టుకున్నది. దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టింది.
అయితే మరో భారీ నాగుపాము రక్షించే సమయంలో జానకి దేవిని అది కాటు వేసింది. ఈ నేపథ్యంలో నిమిషాల వ్యవధిలోనే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో నేపాల్లోని త్రివేణిలో ఉన్న పాముకాటు చికిత్సా కేంద్రానికి ఆమెను తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నది.
जिन महिला के गले में आप किंग कोबरा देख रहे हैं वो हैं बिहार के बगहा में वाल्मीकिनगर की जानकी देवी और लोग उन्हें ‘स्नेक लेडी’ के नाम से जानते हैं.
वाल्मीकिनगर के विशाहा गांव में उस समय अफरा-तफरी मच गई, जब एक आदमी के घर में करीब 10 फीट लंबा जहरीला किंग कोबरा निकल आया. तुरंत… pic.twitter.com/hna8qso1S8
— Kishor Joshi (@KishorJoshi02) July 16, 2026