అమ్ముడుపోని ఇండ్లు 1.43 లక్షలు
స్వరాష్ట్రంలో పదేండ్ల పాటు దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పగలు ఆకాశాన్ని తాకే క్రేన్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట కోట్ల రూపాయల విల్లాలు, ఆకాశహర్మ్యాల ప్రకటనలతో నగరం వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్నా..
- స్థిరాస్తి రంగానికి ‘రేవంత్’ గ్రహణం
- బిల్డర్లకు శాపంగామారుతున్నకాంగ్రెస్ సర్కార్ విధానాలు
- రోజు రోజుకూ పెరుగుతున్న గృహ నిల్వల భారం
- నివాసితుల్లేక వెలవెలబోతున్న ఆకాశహర్మ్యాలు
- అమ్ముడవడానికి 28 నుంచి 30 నెలల సమయం
- అనరాక్- సీఆర్ఈ మ్యాట్రిక్ తాజా నివేదికలో వెల్లడి
- గతంలో బంగారుబాతులా వెలిగిన రియల్ రంగం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రియల్టర్లు
సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో పదేండ్ల పాటు దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పగలు ఆకాశాన్ని తాకే క్రేన్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట కోట్ల రూపాయల విల్లాలు, ఆకాశహర్మ్యాల ప్రకటనలతో నగరం వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్నా.. రాత్రి 8 గంటలు దాటితే అసలు రంగు బయటపడుతోంది. కోకాపేట, నియోపొలీస్, నార్సింగి, తెల్లాపూర్ ప్రాంతాల్లోని విలాసవంతమైన టవర్లలో ఫ్లోర్లకు ఫ్లోర్లు చీకట్లో మగ్గుతున్నాయి. ఇది కేవలం మారెట్ మందగమనం మాత్రమే కాదు.. రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలు, దూకుడు నిర్ణయాల మధ్య నలిగిపోతున్న హైదరాబాద్ రియల్టీ ఆక్రందన.. ఒకవైపు కొనేవారు లేక లక్షలాది ఇళ్లు పేరుకుపోతుంటే, మరోవైపు ప్రభుత్వ విధానాల శాపంతో కొనుగోలుదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అనరాక్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా నివేదికల ప్రకారం.. 2026లో హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య ఏకంగా 20-21 శాతం పెరిగి 1.15 లక్షల నుంచి 1.43 లక్షలకు చేరుకుంది. కొత్త ప్రాజెక్టులేవీ రాకపోయినా.. ప్రస్తుతం ఉన్న ఇండ్లు విక్రయించడానికి కనీసం 28 నుంచి 30 నెలల సమయం పడుతున్నదని ఈ సంస్థలు తేల్చాయి. దేశంలోని టాప్-7 మెట్రో నగరాల్లో ఇదే అత్యధికం! 2026 మూడో త్రైమాసికంలో కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్టుల్లో 97 శాతం రూ.80 లక్షలకు పైబడినవే కావడం గమనార్హం.
అనరాక్-సీఆర్ ఈ మ్యాట్రిక్స్ గణాంకాల ప్రకారం
అమ్ముడుపోని ఇండ్లలో దాదాపు సగం ధర రూ. 1.5 కోట్లకు పైనే. మరో 30 శాతం రూ. 1- 1.5 కోట్ల శ్రేణిలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న స్టాక్‌లో దాదాపు 80 శాతం సగటున 2,050 చ.అడుగులకు పైబడిన 3బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఫ్లాట్లేనని తెలిపారు. అనరాక్ 2026 మూడో త్రైమాసిక నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టుల్లో దాదాపు 66 శాతం లగ్జరీ విభాగంలోనివే. అంతేకాదు, దాదాపు 97 శాతం ప్రాజెక్టులు రూ. 80 లక్షలకు పైబడిన ధరతో ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రియల్ మార్కెట్లో 1.43 లక్షల ఇండ్లు అమ్ముడుపోని జాబితాలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంటూనే బిల్డర్ల కష్టాలను వివరించారు. ఆకాశహర్మ్యాలలోని ఖాళీగా ఉన్న ప్లాట్ల ధరలు పడిపోకుండా ఉండేందుకు బిల్డర్లు కొత్త నాటకాలకు తెరలేపినట్లు తెలిపారు. కోకాపేట, తెల్లాపూర్ ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలలో జనం నివాసం ఉంటున్నారని నమ్మించేందుకు, ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో రాత్రిపూట లైట్లు వెలిగించి ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాడు ‘ఆదివారం సాయంత్రంలోగా టోకెన్ ఇవ్వకపోతే చదరపు అడుగుకు రూ.300 పెరుగుతుంది’ అని బెదిరించిన బిల్డర్లు.. నేడు కొనుగోలుదారులకు ఉచిత భోజనాలు పెట్టి, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మాఫీ చేస్తూ, 8 నుంచి 12 శాతం వరకు రహస్య డిసౌంట్లు ఇస్తూ బతిమలాడుకుంటున్నారు. ఒకప్పుడు ప్రీ-లాంచ్ లో 35 శాతం వాటా ఉన్న ఇన్వెస్టర్లు మారెట్ నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బిల్డర్లకు దికుతోచడం లేదని నివేదికలో స్పష్టం చేశారు.
రేవంత్ సరార్ ‘డబుల్ స్ట్రోక్‌తో బిల్డర్ల విలవిల
ఒకవైపు అధిక ధరలు, ఓవర్ సపె్లైతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు సంచలన నిర్ణయాలు కోలుకోలేని దెబ్బతీశాయి. చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్ (ఎఫ్టీఎల్) బఫర్ జోన్ల ఆక్రమణల తొలగింపు పేరిట 2024 జూలైలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ బుల్డోజర్లు సృష్టించిన విధ్వంసం మధ్యతరగతి కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
గతంలో ప్రభుత్వ అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులైనా సరే, ఎకడో ఒక మూల బఫర్ జోన్ ఉందంటే కూల్చివేత తప్పదనే భయం ప్రజల్లో నాటుకుపోయింది. నిబంధనల ప్రకారం కట్టిన ఇళ్లను కూల్చలేదని హైడ్రా చెబుతున్నా, 15 నెలల్లోనే హైకోర్టులో 700 కేసులు నమోదవడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (ఓసీ) జారీ 6 నెలల పాటు ఆలస్యం కావడం రియల్టీని స్తంభింపజేసింది. సామాన్యులు ఇల్లు కొనాలంటే ప్రభుత్వ అనుమతులను నమ్మకుండా, సొంతంగా శాటిలైట్ ఎఫ్ టీఎల్ మ్యాపులతో సర్వేయర్లను పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సెక్షన్ 22-ఏ ఉచ్చు 2026 ఆగస్టులో అమల్లోకి వచ్చిన రిజిస్ట్రేషన్ చట్టంలోని ‘సెక్షన్ 22-ఏ’ అటు ఇళ్లు కొనుగోలు, ఇటు బిల్డర్లకు పాలిట శాపంగా మారింది. మొత్తంగా రేవంత్సర్కారు తీసుకుంటున్న విదానపరమైన నిర్ణయాలతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

