Watch: హాస్టల్ మెస్‌లోకి ప్రవేశించిన మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే?
Crocodile Walks Into Hostel Mess | ఒక హాస్టల్ మెస్‌లోకి మొసలి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బంది దానిని చూసి షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు. హాస్టల్లో నివసించే యువకులు ఆ మొసలిని బంధించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: ఒక హాస్టల్ మెస్‌లోకి మొసలి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బంది దానిని చూసి షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు. హాస్టల్లో నివసించే యువకులు ఆ మొసలిని బంధించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Crocodile Walks Into Hostel Mess) రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 17న మధ్యాహ్న సమయంలో కోరల్ పార్క్‌లో ఉన్న ఒక బాలుర హాస్టల్లోకి మొసలి ప్రవేశించింది. అది నేరుగా కిచెన్‌లోకి వచ్చింది.
కాగా, కిచెన్‌లో పని చేస్తున్న సిబ్బంది చిన్న మొసలిని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మొసలి సమాచారం తెలిసి హాస్టల్లోని కొందరు కోచింగ్ విద్యార్థులు కూడా బయటకు పరుగెత్తారు. కొందరు యువకులు దానిని నిలువరించి బంధించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ హాస్టల్‌కు చేరుకున్నారు. డైనింగ్ రూమ్‌లోకి ప్రవేశించిన దానిని సురక్షితంగా పట్టుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని నదిలో ఆ చిన్న మొసలిని విడిచిపెట్టారు. సమీపంలోని పెద్ద మురుగు కాలువ ద్వారా హాస్టల్ ప్రాంగణంలోకి అది ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ హాస్టల్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#कोटा के बॉयज हॉस्टल के मेस में घुसा #मगरमच्छ, जान बचाकर भागे छात्र और कर्मचारी…
कोटा: #राजस्थान के कोटा में शुक्रवार को बॉयज हॉस्टल की मेस में मगरमच्छ घुस आया. मेस में खाना बना रहे कुक ने जैसे ही मगरमच्छ को देखा, वह अपनी जान बचाकर वहां से भागा.#crocodile #Rajasthan pic.twitter.com/dlQsRjXNh7
— JITENDRA GAUTAM (@jitendranews11) July 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boys Hostel
- CCTV
- Crocodile
- In Kota
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

