Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Kancherla Bhupal Reddy | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ సమావేశానికి హైదరాబాద్ వెళ్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా ఆయన, పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.
Kancherla Bhupal Reddy | నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి వెళ్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు హైవేపై నిలిపివేశారు. దీంతో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.
నాగార్జునసాగర్ వద్ద ఏపీ జలదోపిడీపై ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. కేఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో బోర్డుకు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా హైదరాబాద్లో జరిగే సమావేశానికి వెళ్తుండగా చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు ముందుకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు నిరసనగా రోడ్డుపై కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Meenakshi chaudhary | “నాకు క్రష్ లేదు.. నా జీవితమే క్రష్ అయిపోయింది”.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

