ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య చోటుచేసుకుంది. సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్ (30)ను నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పవర్‌హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య చోటుచేసుకుంది. సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్ (30)ను నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పవర్‌హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
రాజశేఖర్‌కు ఫోన్ చేసిన దుండగులు పథకం ప్రకారం ఇంటి నుంచి బయటకు పిలిపించారు. అనంతరం అతడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యలో నలుగురు యువకులు పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉండగా.. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాజశేఖర్ హత్యకు గల కారణాలు, నిందితుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్.. డిసెంబర్ 1 నుంచి భారీ ప్రచారం, సంక్రాంతికి మెగా సందడి!
Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

