BRS | కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామంటే అరెస్టులా? బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డంకులు
BRS | నాగార్జునసాగర్ నీటి నిల్వలు, పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డిని చిట్యాల వద్ద అడ్డుకున్నారు.
BRS | నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్‌లను హౌస్ అరెస్ట్ చేయగా.. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిరక్షించాలని, పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సొరంగ నిర్మాణాలపై అభ్యంతరాలను పరిశీలించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కేఆర్ఎంబీ అధికారులను కలవాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన సుమారు 10 మంది సభ్యుల బృందం ఉదయం 10.30 గంటలకు బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేయాల్సి ఉంది.
పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సొరంగ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలు, వాటి ప్రభావంపై సమగ్రంగా పరిశీలించాలని బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగర్‌లో తగిన నీటి నిల్వలను కాపాడాలని, ఏపీ నిర్మాణాల వల్ల తెలంగాణ నీటి హక్కులకు, తాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేయాలని భావించారు.
ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరిన సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హైదరాబాద్ వెళ్తుండగా చిట్యాల వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ఎస్ నేతలు మాత్రం తాము ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు కాకుండా చట్టబద్ధంగా కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్తున్నామని చెబుతున్నారు. నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బోర్డుకు ఫిర్యాదు చేయడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KRMB సమావేశానికి వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి, దాసోజు శ్రవణ్ హౌస్ అరెస్ట్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నాగార్జున సాగర్ వద్ద జలదోపిడీ కోసం ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును అడ్డుకునేందుకు KRMB అధికారులను కలవనున్న బీఆర్ఎస్ నాయకుల బృందం
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు వారిని హౌస్ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
KRMB సమావేశానికి వెళ్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ వెళ్తుండగా చిట్యాల వద్ద భూపాల్ రెడ్డిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామంటే అరెస్టులా? బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డంకులు
Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Meenakshi chaudhary | “నాకు క్రష్ లేదు.. నా జీవితమే క్రష్ అయిపోయింది”.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

