IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే లార్డ్స్ వన్డేలో శుభ్‌మన్ గిల్(52 నాటౌట్ ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 388 పరుగుల ఛేదనలో ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. పవర్ ప్లే తర్వాత దూకుడు పెంచిన గిల్ అర్ధ శతకం సాధించాడు. ఆదిల్ రషీద్ ఓవర్లో ఫోర్, డబుల్స్ తీసిన గిల్ 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ 36 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు.
లార్డ్స్ వన్డేలో భారత ఓపెనర్లు శుభారంభమిచ్చారు. పవర్ ప్లే తర్వాత గేర్ మార్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(52 నాటౌట్) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ పేస్ దళాన్ని కాచుకున్న గిల్.. రషీద్ ఓవర్లో ఫోర్, ఆ వెంటే డబుల్స్‌తో వన్డేల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ(36 నాటౌట్) రెండు సిక్సర్లు బాదినా.. పవర్ ప్లేలో 41 డాట్ బాల్స్ వేశారు ఇంగ్లండ్ బౌలర్లు. 15 ఓవర్లకు స్కోర్ టీమిండియా 89-0. ఇంకా విజయానికి 299 రన్స్ కావాలి.
The Captain steps up with a vital FIFTY 👏
Shubman Gill registers his 2️⃣0️⃣th half-century in ODIs to anchor the chase 🔥
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/kacgDA09Hb
— BCCI (@BCCI) July 19, 2026