లక్నో: క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థి ఉన్న సంగతిని టీచర్ పట్టించుకోలేదు. తనిఖీ చేసుకోకుండా తరగతి గదికి లాక్ వేసి వెళ్లిపోయారు. క్లాస్‌రూమ్‌లో బంధీ అయిన ఆ స్టూడెంట్ ఏడుస్తుండటాన్ని స్థానికులు గమనించారు. టీచర్‌కు సమాచారం ఇవ్వడంతో లాక్ తెరిచి ఆ బాలుడ్ని బయటకు రప్పించారు. (Student locked in classroom) ఆ సంఘటన నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం పరియాన్వ్ గ్రామ పంచాయతీ బన్‌పుర్వా ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు క్లాస్‌రూమ్‌లో ఉండగా టీచర్ గమనించలేదు. ఆ గదికి లాక్ వేసుకుని వెళ్లిపోయారు.
కాగా, క్లాస్‌రూమ్‌లో బంధీ అయిన ఆ విద్యార్థి కిటికీ వద్ద ఏడుస్తుండటాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు గంటన్నర తర్వాత అసిస్టెంట్ టీచర్ స్కూల్‌కు తిరిగి వచ్చారు. క్లాస్రూమ్ లాక్ తీసి డోర్ తెరిచి ఆ బాలుడినికి బయటకు తీసుకువచ్చారు. స్కూల్‌కు చేరుకున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఆ జిల్లా ప్రాథమిక విద్యా అధికారి ఈ సంఘటనపై స్పందించారు. బాధ్యురాలైన సహాయ ఉపాధ్యాయురాలు కృష్ణ కుమారిని సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు ముంగ్రా బాద్షాహ్పూర్ బ్లాక్ విద్యా అధికారిని నియమించినట్లు ఆ అధికారి తెలిపారు.
जिला जौनपुर।
कक्षा 2️⃣ में पढ़ने वाले बच्चे को भूलवश क्लास में बंद कर घर चले गए शिक्षक।
परिवार के लोग बच्चे को ढूँढते हुए पहुंचे स्कूल तो बच्चा मिला रोता हुआ।
घंटो बाद खुला ताला बच्चा पहुँचा घर।
प्रथम दृष्टया लापरवाही का मामला आया सामने।
वीडियो हुआ वायरल। pic.twitter.com/bJpyGfxQpJ
— Shakti Singh/शक्ति सिंह (@singhshakti1982) July 18, 2026