Special Officers | ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యేక అధికారుల నియామకం
Special Officers | ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : ఎల్ నినో ( El Nino ) ప్రభావంతో తెలంగాణలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను( IAS Officers ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ( Special Officers ) నియమించింది.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లాకు వికాస్ రాజ్, కరీంనగర్ జిల్లాకు బెనహర్ మహేశ్ దత్తా ఎక్కా, మెదక్ జిల్లాకు ఏ వాణి ప్రసాద్‌ను నియమించింది. నిజామాబాద్ జిల్లాకు యోగితా రాణా, నల్గొండ జిల్లాకు హరి చందన దాసరి, ఆదిలాబాద్‌కు ఇలాంబర్తి, వరంగల్‌కు ఎ.శ్రీదేవిసేన, మహబూబ్‌నగర్‌కు వి.పి గౌతమ్, ఖమ్మం ఉమ్మడి జిల్లాకు అనుదీప్ దురిశెట్టిని ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక అధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, తాగు నీరు, భూగర్భ జలమట్టాలు, వ్యవసాయ సాగు, విద్యుత్ సరఫరా వివరాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 20 వ తేదీన అన్ని జిల్లాలో ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

