ముంబై: బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే ఆ వంతెన గుంతలమయంగా మారింది. వర్షాలకు భారీ గొయ్యి ఏర్పడింది. (sinkhole on Nagpur bridge) దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని కామ్థి రైల్వే స్టేషన్‌పై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. 2020 నుంచి ఐదేళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 75 శాతం పనులు పూర్తయ్యాయి.
కాగా, మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ వంతెనపై రోడ్డు దెబ్బతిన్నది. వర్షాలకు రోడ్డు గోతులమయంగా మారింది. ఒక చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది చూసి స్థానికులు మండిపడ్డారు. వంతెన నిర్మాణం నాణ్యతపై సందేహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ప్రారంభించేలోపు ఇది కూలిపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
⚠️ Modi Ki Guarantee: Corruption
📍Nagpur
A Newly Built Bridge, slated for inauguration, is already exhibiting Significant Damage.#Maharashtra #planecrash #BiharBandh #बिहार_बंद #bridgecollapse pic.twitter.com/4SfjfUIi4Z— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 9, 2025
Also Read:
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Fake Poll Officials | ఫొటో కోసం మెడలోని గొలుసు తీయమని చెప్పి.. చోరీ చేసిన నకిలీ ఎన్నికల సిబ్బంది
Watch: గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు