పాట్నా: ఓట్ల సర్వే కోసం నకిలీ ఎన్నికల సిబ్బంది (Fake Poll Officials) ఒక ఇంటికి వెళ్లారు. ఫొటో కోసం మెడలోని బంగారు గొలుసు తీయాలని మహిళకు చెప్పారు. ఆ తర్వాత ఆ చైన్ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయారు. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రత్యేక డ్రైవ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పేరుతో ఇద్దరు వ్యక్తులు నెరువా గ్రామంలోని వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లారు. వివరాలు అడిగిన తర్వాత ఫొటో కోసం వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ తీయాలని చెప్పారు. ఆ తర్వాత ఆధార్ కార్డు చూపించాలని అడిగారు. ఆ హడావుడిలో పరుపు కింద పెట్టిన గొలుసును వారు చోరీ చేసి పారిపోయారు.
కాగా, ఎన్నికల సిబ్బందిగా పేర్కొన్న ఆ వ్యక్తులు గొలుసు చోరీ చేసినట్లు వృద్ధురాలి భర్త గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Watch: గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు
Delhi Double Murder | మహిళ, పసిపాప నోటికి టేప్ వేసి.. గొంతులు కోసి హత్య చేసిన వ్యక్తి