Aya Sher | నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాట సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అవుతోంది. నాని బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా, ఇప్పుడు అదే పాట కాపీరైట్ వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆయా షేర్’ పాటలో నాని వేసిన ఎనర్జిటిక్ హుక్ స్టెప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు చూడని మాస్ స్టైల్లో నాని స్టెప్స్ వేయడంతో అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఆ హుక్ స్టెప్నే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, డ్యాన్సర్ బాబా జాక్సన్ ఈ స్టెప్ తనదేనని ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆయన, గతంలో తాను చేసిన డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ… ‘ఇది ఒరిజినల్, ఇది కాపీ’ అంటూ రెండు వీడియోలను పోల్చి చూపించారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. డ్యాన్సర్ చేసిన ఆరోపణలపై నెటిజన్ల నుంచి మిక్స్డ్ స్పందన వస్తోంది. కొందరు నిజంగానే స్టెప్స్ సేమ్‌గా ఉన్నాయని అభిప్రాయపడుతుండగా, మరికొందరు డ్యాన్స్‌లో ఇలాంటి లెగ్ మూమెంట్స్ సాధారణమేనని, వాటిని కాపీగా పరిగణించడం సరైంది కాదని అంటున్నారు. గతంలో పలువురు స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్టెప్స్ వేశారని ఉదాహరణలు చూపిస్తున్నారు.
ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. కాబట్టి ఈ కాపీరైట్ ఆరోపణలపై ఆయన లేదా సినిమా యూనిట్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘ఆయా షేర్’ సాంగ్ ఇప్పుడు వివాదంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ, షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి వాయిదా వేశారు. మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.