Nani | నేచురల్ స్టార్ నాని వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ‘ది ప్యారడైజ్’లో నాని పూర్తిగా కొత్త గెటప్‌లో, ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. రగ్గ్డ్ స్టైల్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో నాని మరోసారి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ‘దసరా’లో చూపించిన రా ఎనర్జీకి మించి ఈసారి మరింత పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ, సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ (SCU)లో భాగమని సమాచారం. ఈ కాంబినేషన్ ప్రకటించగానే అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్‌లో నటిస్తోంది. ఒకవేళ ‘బ్లడీ రోమియో’లో కూడా ఆమె ఓకే అయితే, ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా అవుతుంది.
‘యానిమల్ ’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి, నాని సరసన నటిస్తే ఆ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవైపు రా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మరోవైపు స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇలా రెండు విభిన్న జానర్లలో నాని తన నటనా పరిధిని విస్తరించుకుంటున్నాడు. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఈ రెండు సినిమాలతో మరోసారి తన రేంజ్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ‘ది ప్యారడైజ్’ మరియు ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్‌లు నాని కెరీర్లో కీలక మైలురాళ్లుగా నిలవనున్నాయా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఈ క్రేజీ కాంబినేషన్లపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.