‘శిక్షణను సద్వినియోగం చేసుకుని యువత ఉపాధి అవకాశాలు పొందాలి’
మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందని..
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 14 : మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫెకెట్ల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
యువత ప్రతి ఒక్కరూ పని చేస్తూ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో యువతకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి మార్గాలను చూపించాలని, అప్పుడే సెట్విన్ ల లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటిఐ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కేంద్రాలు, న్యాక్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సెట్విన్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న వెంటనే ఏర్పాటు చేస్తానని, యువతీ యువకులు ఇలాంటి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

