ఇటానగర్: ఒక యువకుడు స్కూల్ హాస్టల్లోని బాలికలను లైంగికంగా వేధించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న జనం ఆ యువకుడ్ని బయటకు లాక్కెళ్లి కొట్టి చంపారు. (Teen Dragged Out Of Police Station, Lynched) అరుణాచల్ ప్రదేశ్లోని లోయర్ దిబాంగ్ లోయ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాంకు చెందిన 17 ఏళ్ల యువకుడు అరుణాచల్ ప్రదేశ్లోని రోయింగ్ పట్టణంలో పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలోని స్కూల్ హాస్టల్లోకి అతడు వెళ్లేవాడు. ఆరు నుంచి ఎనిమిది ఏళ్ల వయస్సున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
కాగా, కొందరు బాలికలు కడుపులో నొప్పి, ఇతర సమస్యలతో బాధపడటంతో తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఈ విషయం వారికి తెలిసింది. ఒక పేరెంట్ ఫిర్యాదుతో జూలై 10న ఆ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు.
మరోవైపు ఆ యవకుడు చాలా మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు పలువురు పేరెంట్స్ తెలుసుకున్నారు. దీంతో జూలై 11న పెద్ద గుంపు ఆ పోలీస్ స్టేషన్ను ముట్టడించింది. లోపలున్న యువకుడిని బయటకు లాక్కొచ్చారు. అతడ్ని కొట్టి చంపారు. అదనపు పోలీస్ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
Also Read:
Man’s Phone Snatched | వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన అగంతకుడు.. బయటపడిన భార్య వివాహేతర సంబంధం
Russian Woman Living In Cave | ఇద్దరు కూతుళ్లతో కలిసి.. ఏళ్లుగా గుహలో నివసిస్తున్న రష్యా మహిళ