భువనేశ్వర్: లైంగిక కోరిక తీర్చాలని ఒక విద్యార్థిని టీచర్ వేధించాడు. లేకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని నిప్పంటించుకున్నది. (Student Sets Ablaze In Odisha) ఒడిశాలోని బాలాసోర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక యువతి ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు చదువుతున్నది. విభాగాధిపతి అయిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహు లైంగిక కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. లేకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు.
కాగా, ఈ టీచర్ వేధింపులను ఆ విద్యార్థిని భరించలేకపోయింది. జూలై 1న ఆ కాలేజీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఆమె ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆ కమిటీ తెలిపింది. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో శనివారం కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిసింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. ఇంతలో ఉన్నట్టుండి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నది. మంటల్లో కాలుతున్న ఆమె ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తింది.
మరోవైపు ఇది చూసి అక్కడున్న విద్యార్థులు షాక్ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ఒక స్టూడెంట్ ప్రయత్నించగా అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. నిప్పంటించుకున్న విద్యార్థినికి 95 శాతం, కాపాడబోయిన స్టూడెంట్‌కు 70 శాతం కాలిన గాయాలయ్యాయి. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు విద్యార్థిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, కాలేజీలో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#ओडिशा के बालासोर जिले में स्थित एफएम कॉलेज में एक बेहद चौंकाने वाली घटना सामने आई है। यहां कॉलेज की एक छात्रा ने कथित रूप से एक प्राध्यापक द्वारा उत्पीड़न से तंग आकर कॉलेज परिसर के बाहर खुद को आग लगा ली। इस हैरान कर देने वाले सीसीटीवी वीडियो को देखकर किसी की भी रूह कांप जाएगी। pic.twitter.com/9YOvwkxSCV
— Ramdeep Mishra (@ramdeepmishra11) July 12, 2025
Also Read:
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు
Jal Samadhi Protest | స్కూల్ వద్ద నిలిచిన నీరు.. మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి’ నిరసన