ముంబై: ఒక ఆటో డ్రైవర్ తాను హిందీనే మాట్లాడతానని, మరాఠీ రాదని అన్నాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. (Auto Driver Beaten) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి ఆటో నడుపుతూ విరార్‌లో నివసిస్తున్నాడు. కొన్ని రోజల కిందట విరార్ స్టేషన్ సమీపంలో అదే రాష్ట్రం నుంచి వలస వచ్చిన యువకుడు, ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, మరాఠీలో మాట్లాడాలన్న ఆ యువకుడిని హిందీ లేదా భోజ్‌పురిలో మాట్లాడాలని ఆటో డ్రైవర్ బలవంతం చేశాడు. ‘నేను హిందీలో మాట్లాడతా, భోజ్‌పురిలో మాట్లాడతా. నాకు మరాఠీ రాదు, మరాఠీ మాట్లాడను ’ అని అతడిపై అరిచాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు శనివారం విరార్ స్టేషన్ సమీపంలో ఆ ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. మరాఠీ భాషను అవమానించినందుకు అతడి చెంపలు వాయించారు. మహిళా కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడు క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Auto driver is beaten by Shivsena and MNS workers for disrespecting the Marathi language…#MarathiNews #marathilanguagerow #Virar#palghar #MBVVpolice @Dev_Fadnavis @DGPMaharashtra pic.twitter.com/mxkPYUES4L
— Indrajeet chaubey (@indrajeet8080) July 13, 2025
Also Read:
BJP Leader Shot Dead | బీజేపీ నేత హత్య.. కాల్పులు జరిపి చంపిన దుండగులు
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు