హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు పేరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటుకు జారీ చేసిన జీవో-6ను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్, ఐఏఎస్ స్మితాసభర్వాల్, రిటైర్డు ఐఏఎస్ జోషి వేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.