ఆ నిధులు రైతు వేదికలకు ఖర్చు చేయండి
వ్యవసాయ సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతు తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఏఈవోల కృషితో ఫార్మర్ రిజిస్ట్రీలో తెలంగాణ ఫస్ట్
- కేంద్ర ప్రోత్సాహకం కింద 422 కోట్లు మంజూరు
- ఇతర అవసరాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్
- రైతు వేదికల నిర్వహణకు ఆ నిధులు వినియోగించాలని ఏఈవోల డిమాండ్
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతు తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వేగంగా ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) నిరంతర కృషితో ఇది సాధ్యమైంది. ప్రతి రైతుకూ ఈ కార్యక్రమ ప్రాధాన్యంపై అవగాహన కల్పించి వివరాలు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఫార్మర్ రిజిస్ట్రీలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం కింద రూ.422 కోట్లు మంజూరు చేసింది. అయితే, వ్యవసాయ శాఖకు దక్కిన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనపై ఏఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి ఫలితంగా వ్యవసాయ శాఖకు దక్కిన నిధులను రైతు సంక్షేమం కోసమే వినియోగించాలని కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు లేక శిథిలావస్థకు చేరుతున్న రైతు వేదికలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను ఉపయోగించాలని సూచిస్తున్నారు. వాస్తవానికి, బీఆర్ఎస్ హయాంలో రైతులను సంఘటితం చేయడంతోపాటు వారందరికీ వ్యవసాయంలో నూతన విధానాలపై శిక్షణ ఇచ్చేందుకు 2,601 రైతు వేదికలను నిర్మించారు. ప్రస్తుత ప్రభుతం కూడా రైతు వేదికల్లో రైతునేస్తం పేరుతో ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. అయితే, కనీస సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. సమావేశాలకు వచ్చే రైతులకు కనీసం తాగునీరు కూడా కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. రైతు వేదికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో కిటీకులు, తలుపులు పాడై మం దుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చిన రూ.422 కోట్లను రైతు వేదికల అభివృద్ధికి కేటాయించాలని, వీడియో కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు అవసరమైన ఇంటర్నెట్, కుర్చీలు, టీవీలు లాంటివి ఏర్పాటు చేయడం కోసం వినియోగించాలని ఏఈవోలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే కోసం ఇస్తున్నట్టుగానే ఫార్మర్ రిజిస్ట్రీకి కూడా తమకు ప్రోత్సాహకం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

