భోపాల్: కొత్తగా నిర్మించిన విమానాశ్రయం సరిహద్దు గోడలోని కొంత భాగం కూలిపోయింది. (Airport Wall Collapses) దీంతో రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. కొన్ని నెలల కిందట ప్రారంభమైన రేవా విమానాశ్రయం చుట్టూ సరిహద్దు గోడ నిర్మిస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి కట్టిన గోడలోని కొంత భాగం కూలిపోయింది. కింద ఉన్న మట్టి కుంగిపోవడంతో ఆ గోడ భాగం కూలినట్లు స్థానికులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చుట్టూ కడుతున్న గోడ నిర్మాణం నాణ్యతపై అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేతోపాటు చాలా భాగం నీట మునిగింది. అలాగే ప్రారంభానికి ముందు కూడా గత ఏడాది వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌కు నష్టం వాటిల్లింది. అయితే రికార్డు స్థాయిలో 18 నెలల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం భోపాల్ నుంచి ఖజురహో, జబల్పూర్ను రేవాతో అనుసంధానించారు. 19 సీట్లు ఉన్న రెండు విమానాలు నడుపుతున్నారు. రాబోయే నెలల్లో ఇక్కడి నుంచి 72 సీట్ల విమానాలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read:
BJP Leader Shot Dead | బీజేపీ నేత హత్య.. కాల్పులు జరిపి చంపిన దుండగులు