IND vs ZIM : చావోరేవో పోరులో భారత ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్ శర్మ జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ శాంసన్(24) ఉన్నతం సేపు తనదైన స్టయిల్లో చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. మరోసారి స్వల్ప స్కోర్‌కే అతడు వెనుదిరిగాడు. ముజరబని ఓవర్లో సిక్సర్‌కు యత్నించి ఔటయ్యాడు. దాంతో.. 46 వద్ద మొదటి వికెట్ పడింది. శాంసన్ ఔటైనా.. అభిషేక్ శర్మ(33 నాటౌట్) , ఇషాన్ కిషన్(15 నాటౌట్)లు జోరు తగ్గించలేదు. పవర్ ప్లే చివరి బంతిని అభిషేక్ సిక్సర్‌గా మలిచాడు. ఫలితంగా భారత్ వికెట్ నష్టానికి 80 రన్స్ కొట్టింది.
Productive powerplay! 🔥
Abhishek Sharma and Ishan Kishan making it count 👏#TeamIndia 80/1 after 6 overs.
Updates ▶️ https://t.co/p4GxtxGkBf#T20WorldCup | #MenInBlue | #INDvZIM | @OfficialAbhi04 | @ishankishan51 pic.twitter.com/xleINSblV9
— BCCI (@BCCI) February 26, 2026