Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
Nivetha Pethuraj | ‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఓ దశలో సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట.
Nivetha Pethuraj | ‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఓ దశలో సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట. కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన నివేదా.. ఏకంగా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని అనుకున్నానని తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం మాత్రం మళ్లీ వరుస అవకాశాలతో నటిగా బిజీ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం తన రూపంలో మార్పులు చేసుకోవాలనే ఆలోచన తనకు వచ్చిందని నివేదా తెలిపారు. ముఖ్యంగా పెదవుల ఆకారం కోసం శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై తన వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించగా.. ఆయన తీవ్రంగా మందలించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించారని చెప్పారు. దీంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోకుండానే, తమ సహజ రూపంతోనే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారని గుర్తుచేసుకున్నారు. వాళ్లను చూసిన తర్వాత తనకు కూడా తన రూపం గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నాననే విషయం అర్థమైందని నివేదా పేర్కొన్నారు.
తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని నివేదా చెప్పారు. తాను మనసులో ఏదైనా ప్రతికూలంగా ఊహించుకుంటే అది నిజమైపోతుందనే భావన కలిగేదని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలోనూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తన మాజీ ప్రియుడు తనను ఎవరి కోసం వదిలి వెళ్లొచ్చనే విషయాన్ని ముందే ఊహించానని, చివరకు అదే జరిగిందని వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఏ విషయాన్నీ ముందుగానే ఊహించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే మనసులో ఆలోచనలు రావడం సహజమే కదా అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు., 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని నివేదా తెలిపారు. ఆ సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, దాని ప్రభావంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. డిప్రెషన్‌తో పాటు పానిక్ అటాక్స్ కూడా ఎదురయ్యాయని వెల్లడించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డానని చెప్పిన నివేదా.. మళ్లీ సినిమా అవకాశాలు రాకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే పరిస్థితులు మారడంతో మళ్లీ నటనపై దృష్టి పెట్టానని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- break up
- Dubai
- engagement
- Himalayas
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

