ధన్‌బాద్ గ్రామ సమస్యలపై జీఎం శాలెం రాజుకు వినతి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్‌బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజుకు..
రుద్రంపూర్, ఫిబ్రవరి 26 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్‌బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజుకు ధన్‌బాద్ ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు కీలక సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పరిధిలో సులబ్ కాంప్లెక్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా సులబ్ కాంప్లెక్స్‌ను పునర్నిర్మించాలని కోరారు. అలాగే సింగరేణి నుండి వచ్చే కాలువలను నిరంతరం శుభ్రపరచాలన్నారు.
గ్రామ ప్రజలు ముఖ్యంగా తాగునీటి కొరతతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో పబ్లిక్ ట్యాప్స్ ఏర్పాటు చేయాలని, గతంలో రుద్రంపూర్, గౌతంపూర్ గ్రామ పంచాయతీలకు కేటాయించినట్లే ధన్‌బాద్ గ్రామ పంచాయతీకి కూడా ఆర్వో వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని కోరారు. దీంతో పంచాయతీ పరిధిలోని ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఆర్చ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై జీఎం శాలెం రాజు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీదేవి, మోతి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

