హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): ఏదైనా ఒక భారీ కుంభకోణంలో సూత్రధారులు… పాత్రధారుల మధ్య బంధం రాత్రికిరాత్రి పు ట్టుకురాదు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఏ క్తాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టి న యూనిటీ మాల్లో భారీ స్కామ్ కూడా స రిగ్గా అలాంటిదే.
గతంలో పలు ‘భూ’దందా ల్లో సర్కార్ పెద్దలు, రెండు నిర్మాణ సంస్థల మధ్య అల్లుకున్న బంధమే తాజాగా ఈ ‘యూనిటీ’ మాల్ రూపంలో బయటికి వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే ఎకరా రూ.237 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టి, చారాణా సర్కార్ ఖాతాలో వేసి… బారాణా ఆ సంస్థల చేతుల్లో పెట్టడం వెనుక వాటాల స్థాయి కూడా భారీగానే ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమం లో దేశంలోని రాష్ర్టాలు చేపట్టే యూనిటీ మాల్ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌లోని రాయదుర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు అంచనాల్లో అతి పెద్దది కావడం ఒక వంతైతే.. పీపీపీ మోడల్లో చేపట్టే రాష్ర్టాల్లో ప్రభుత్వ వాటాగా 30శాతం నిర్మాణ విస్తీర్ణం ఉంటే ఇక్కడ మాత్రం దానిని 34శాతానికి పరిమితం చేయడం గమనార్హం. అంతేకాదు.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ డెవలపర్‌కు లీజు ప్రాతిపదికన నిర్మాణ విస్తీర్ణాన్ని అప్పగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఆ విస్తీర్ణాన్ని అమ్ముకొనే వెసులుబాటు ఇవ్వడం వెనక అసలు మతలబు ఉన్నదనే విమర్శలున్నాయి.
కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ పరుగులు పెడుతున్నది. చివరకు దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం ఏక్తా ప థకంలోనూ రేవంత్ ప్రభుత్వం భారీ స్కా మ్కు తెరతీసింది. ముఖ్యంగా ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాయదుర్గం యూనిటీ మాల్ ప్రాజెక్టు అతి పెద్దది. కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాలే సొంత నిధులతో మాల్ నిర్మిస్తుండగా, మరికొన్ని చోట్ల పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో చేపడుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌కు కట్టబెట్టడం లేదు. పీపీపీ మో డ్లో చేపట్టే రాష్ర్టాల్లో డెవలపర్ వాటా కింద నిర్మాణ సంస్థలకు ఇచ్చే ని ర్మాణ విస్తీర్ణాలపై ఆయా సంస్థలకు లీజు హ క్కులు మాత్రమే కల్పిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డెవలపర్‌కు లీజు ప్రాతిపదికనే అప్పగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏకంగా డెవలపర్‌కు నిర్మాణ విస్తీర్ణాన్ని అమ్ముకొనే హక్కు కల్పించడమే రూ.1,500 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నట్టేనని రియల్ ఎస్టేట్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఓ వైపు ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతుల నుంచి పారిశ్రామిక అవసరాల పేరుతో విలువైన భూముల్ని గుంజుకుంటూ మరోవైపు వేల కోట్ల విలువైన భూ ముల్ని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నదంటే.. ఇందు లో సర్కార్ పెద్దల పాత్ర ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యం గా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కన పెట్టి అదనం గా 45 అంతస్తులతో నిర్మిస్తున్న టవర్‌ను మొత్తం ప్రై వేట్ సంస్థలకు మా ర్కెట్లో విక్రయించేందుకు అప్పగించి రూ.1,600 కోట్ల స్కామ్‌కు తెరతీసిందంటున్నారు. ఇతర రాష్ర్టాలు డెవలపర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ వాటా కింద 30శాతం నిర్మాణ విస్తీర్ణాన్ని తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాయదుర్గం ప్రా జెక్టులో దానిని 34శాతానికి కుదించడం గమనార్హం. సుమారు 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ప్రభుత్వం కోల్పోతుంది.
అత్యంత ఖరీదైన ప్రాంతమైన ఖాజాగూడలో వంశీరాం బిల్డర్స్ దాదాపు 29 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆకాశహర్మ్యాలు నిర్మించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణ ప్రాజెక్టు చేపట్టారని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీ సహా పలు సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్పారు. దీనిపై హై డ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు హైకోర్టును ఆశ్రయించారు. కానీ చాలాకాలంగా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ఊసే ఎత్తకపోగా, హైడ్రా, రెవెన్యూ సహా ఏ ఒక్క శాఖ కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చివరకు హైకోర్టులో ఆ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ పరిస్థితి ఏమిటో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిన సమయంలోనే సర్కార్ పెద్దలకు ఆ ప్రాజెక్టులో 2.40 లక్షల చదరపు అడుగుల తాయిలం ఇచ్చేందుకు నిర్ణయం జరిగిపోయిందనే ఆరోపణలు వచ్చా యి. ఈ క్రమంలోనే తాజా ప్రాజెక్టును దక్కించుకోవడంలో వంశీరాం బిల్డర్స్ లీడ్ మెంబర్‌గా మారారు. అంటే ఖాజాగూడ బంధమే ఇప్పుడు ఈ ‘యూనిటీ’కి మార్గం సుగమం చేసినట్టయ్యిందనే చర్చ జరుగుతున్నది.
యూనిటీ మాల్ టెండ్ల(ఆర్ఎఫ్పీ)లోనే పెద్ద గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్కార్ పెద్దలు ముందుగా అనేక నిర్మాణ సంస్థలతో బేరసారాలు చేసి చివరకు పరస్పర ప్రయోజనాలు ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగిన తర్వాతే గతంలో సీఎంవోకు చేరిన ఫైల్‌కు కదలిక వచ్చినట్టు తెలిసింది. అందుకే నామమాత్రంగా డెవలపర్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారని పలు నిర్మాణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ పెద్దలను రెండు బడా కంపెనీలు కలిసిన సమయంలో ఒక టవర్ ప్రాతిపదికనే బేరసారాలు సాగాయని విశ్వసనీయంగా తెలిసింది. ఆ తర్వాత వంశీరాం, అపర్ణ కంపెనీలు తెరపైకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు మొదలైనట్టు సమాచారం. కాగా ఈ రెండు కంపెనీలు కూడా ‘ముఖ్య’నేతతోపాటు నంబర్-2 మంత్రితో ఉన్న పాత‘బంధాల’ కారణంగా ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసినట్టు ఓ నిర్మాణ కంపెనీ యజమాని చెప్పుకొచ్చారు.
పీఎం ఏక్తా ప్రాజెక్టు దక్కించుకున్న ద్వయంలో రెండో కంపెనీ అయిన అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్‌కు సర్కార్ పెద్దలకు రెండున్నరేండ్లలో భారీ బంధాలే ఏర్పడినట్టు మార్కెట్వర్గాల్లో చర్చ. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్, సంగారెడ్డి జిల్లాలోని వెలిమెల గ్రామ సరిహద్దులో ఉన్న బిలా దాఖలా భూములతోపాటు గిరిజనుల వందల ఎకరాల అసైన్డ్, దేవాదాయ, సీలింగ్ సర్ప్లస్ రూపంలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకున్నారు.
దీనిపై సుదీర్ఘకాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆ భూముల్ని అపర్ణ కంపెనీ డెవలప్మెంట్ కింద తీసుకొనేందుకు గతంలోనే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ భూముల చుట్టూ ప్రహరీ కూడా ఆ కంపెనీయే వేసిందని పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలో సదరు కంపెనీలోని కీలక వ్యక్తి.. నంబర్-2 మంత్రి స్నేహితుడే గాక ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రెవెన్యూ శాఖ పరంగా ఆ భూముల రికార్డుల తారుమారులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నదనే విమర్శలున్నాయి. అందుకే ఆ బంధం ఇప్పుడు ఈ ‘యూనిటీ’ మాల్ రూపంలో మరోసారి తెరపైకొచ్చినట్టు మార్గెట్ వర్గాలు నొక్కి చెప్తున్నాయి.
యూనిటీ మాల్‌పై ఇటీవల నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం కోసం క్లిక్ చేయండి