ఇంజెక్షన్ వికటించి బాలిక మృతి
ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
- ఆర్ఎంపీ నిర్లక్ష్యంవల్లేనంటున్న కుటుంబ సభ్యులు
వైరా టౌన్ (కొణిజర్ల), ఆగస్టు 10 : ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. చల్లా రమేశ్-మౌనిక దంపతుల కుమార్తె హిమశ్రీ (14) కొణిజర్లలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్నది. జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆదివారం తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్ఎంపీ సంపత్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. తర్వా త అది రియాక్షన్ కావడంతో బాలిక శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆర్ఎంపీ కారణంగానే బాలిక మృతిచెందినట్టు తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ప్రాణం తీసిన రూ.600 లొల్లి ; రావాల్సిన డబ్బులు అడిగితే దాడి మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
జగిత్యాల రూరల్, ఆగస్టు 10: ఆరు వందల రూపాయల లొల్లి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సదరు వ్యక్తి దాడి చేయడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బందెల రమేశ్ (38) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతంలో తాను డ్రైవర్గా పనిచేసినప్పుడు రావాల్సిన రూ.600 ఇవ్వకపోవడంతో రమేశ్ ఇటీవల గడ్డం గంగారెడ్డిని దూషించాడు. దీంతో కోపం పెంచుకున్న గంగారెడ్డి ఆదివారం ఉదయం మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మల్లేశ్వరి సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గంగారెడ్డి, అజయ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

