న్యూఢిల్లీ: సఫారీకి వెళ్లిన మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఒక మగ గొరిల్లా ఆమె జుట్టు పట్టుకున్నది. (Male Gorilla Grabs Woman’s Hair) దూరంగా ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసింది. ఆ మగ గొరిల్లా వద్దకు అది వచ్చింది. మగ గొరిల్లాను దొర్లించి కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు టూరిస్టులు గొరిల్లాలు ఉండే అటవీ ప్రాంతంలో సఫారీకి వెళ్లారు. ఒక మహిళా పర్యాటకురాలు మగ గొరిల్లా వద్దకు వెళ్లింది. అయితే అకస్మాత్తుగా ఆమె జుట్టును అది పట్టుకున్నది. తదేకంగా ఆ మహిళ వంక చూస్తూ ఉండిపోయింది.
కాగా, కొంతదూరంలో ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసింది. దొర్లుతూ మగ గొరిల్లా వద్దకు చేరింది. అది సీరియస్గా చూడటంతో మగ గొరిల్లా ఆ మహిళ జుట్టును వదిలేసింది. అనంతరం ఆడ గొరిల్లా మగ గొరిల్లాపై దాడి చేసింది. దానిని దొర్లించి కొట్టింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ‘జాతులతో సంబంధం లేదు. మహిళలు దీనిని ఎప్పుడూ సహించరు’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘అన్ని జాతులు ఒకేవిధంగా ప్రవర్తిస్తాయి. మగవారు సరసాలాడటం ఆపలేరు, ఆడవారు అసూయపడటం ఆపలేరు’ అని మరొకరు పేర్కొన్నారు. ‘మహిళా గెరిల్లాలు కూడా తమ భాగస్వామి పట్ల ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి’ అని ఒకరు చమత్కరించారు.
Male Gorilla grabs Girls Hair, Gets Beaten by his Female Gorilla 🤣 pic.twitter.com/uZG5Fo3gqG
— Rosy (@rose_k01) July 11, 2025
Also Read:
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్
Man Kills Son | హోటల్ రూమ్లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తండ్రి