పాట్నా: హోటల్ రూమ్‌లో బస చేసిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపాడు. (Man Kills Son) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. ప్రభాకర్ మహతో అనే వ్యక్తి తన భార్య, ఆరేళ్ల కుమారుడితో కలిసి పాట్నా చూసేందుకు శనివారం అక్కడకు చేరుకున్నాడు. పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో వారు బస చేశారు.
కాగా, శనివారం రాత్రి ఆ హోటల్ గదిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ప్రభాకర్ ఆరేళ్ల కుమారుడైన సన్నీని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత నేలపైకి అతడ్ని విసిరేశాడు. అనంతరం ఆ హోటల్ నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సన్నీ మరణించాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుతో భర్త ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్