భోపాల్: ఇద్దరు పోలీసులకుపైకి వాహనం దూకించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై హత్యాయత్నం కేసు నమోదైంది. (Congress MLA’s Son Charged) మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జోబాట్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సేనా పటేల్ కుమారుడు పుష్పరాజ్ సింగ్ గత వారం రాత్రి వేళ నంబర్ ప్లేట్ లేని ఎస్‌యూవీని వేగంగా నడిపాడు. అలీరాజ్‌పూర్ బస్ స్టాండ్ సమీపంలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ మీదకు ఆ వాహనాన్ని దూకించాడు. అయితే వారిద్దరూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో విద్యుత్త్ స్తంభాన్ని ఆ వాహనం ఢీకొట్టింది.
కాగా, తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ గుజారియా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ కానిస్టేబుల్స్‌పైకి వాహనాన్ని దూకించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు పుష్పరాజ్ సింగ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు డీఎస్పీ అధికారి నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు రాజకీయ ఒత్తిడితోనే తమ కుమారుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సేనా పటేల్, ఆమె భర్త మహేష్ పటేల్ ఆరోపించారు. తమ కుమారుడు నడిపిన వాహనం ప్రమాదానికి గురైందని తెలిపారు. అయితే పోలీస్ సిబ్బందిపై హత్యాయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని మీడియాతో అన్నారు.
A high speeding vehicle driven by a Congress MLA’s son rammed into a police constable before crashing into an electric pole in Madhya Pradesh last week, sources said. The accused was identified as Pushpraj Singh, son of Congress MLA from Jobat, Sena Patel.
The incident took… pic.twitter.com/At0e9rEdWI
— DNA (@dna) July 15, 2025
Also Read:
Watch: ఒడిశాలో మరో అమానుషం.. మరో జంటను నాగలికి కట్టి దున్నించిన వైనం
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?