లక్నో: పెళ్లి జరిగిన రాత్రి వధువుకు వరుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చాడు. గర్భధారణ పరీక్ష చేయమని చెప్పాడు. (Groom Asks Bride To Use Pregnancy Test) దీంతో అతడి తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వారికి ఫోన్ చేయడంతో ఆ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 12న ఒక మహిళతో వ్యక్తికి పెళ్లి జరిగింది. నూతన వధువు వరుడి ఇంటికి చేరుకున్నది. అయితే పెళ్లి అలసట, వేడి వాతావరణం వల్ల ఆమె నిరసంగా కనిపించింది. ఆ రాత్రి తనకు తల తిరుగుతున్నట్లు చెప్పింది.
కాగా, వధువు తీరుపై వరుడు ఆందోళన చెందాడు. తన స్నేహితుల వద్ద ఈ విషయం చెప్పాడు. గర్భందాల్చిన సంకేతాలు కావచ్చని వారు జోక్ చేశారు. దీంతో నవ వరుడు మరింత కలత చెందాడు. సమీపంలోని మెడికల్ షాప్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొన్నాడు. దానిని వధువుకు ఇచ్చి గర్భధారణ పరీక్ష చేయమని చెప్పాడు.
మరోవైపు వరుడి తీరుపై ఆ వధువు ఆగ్రహించింది. తన కుటుంబానికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో వారంతా వరుడి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల మధ్య రెండు గంటలపాటు పెద్ద గొడవ జరిగింది. చివరకు గ్రామస్తులు జోక్యం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయితే జరిగిన విషయాన్ని వరుడు వివరించాడు. అందరి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. మరోసారి ఇలా ప్రవర్తించబోని హామీ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
Also Read:
Woman Murder Husband | భర్తను హత్య చేసి.. ఐదు అడుగుల గోతిలో పాతిపెట్టిన భార్య
Tushar Gandhi | బ్రిటీష్ వారు గాంధీజీని ఆపినట్లు నన్ను ఆపారు: తుషార్ గాంధీ
Watch: ఒడిశాలో మరో అమానుషం.. మరో జంటను నాగలికి కట్టి దున్నించిన వైనం