Woman Murder Husband | భర్తను హత్య చేసి.. ఐదు అడుగుల గోతిలో పాతిపెట్టిన భార్య
Woman Murder Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు స్థానికులకు చెప్పింది. అయితే ఆమెపై అనుమానం రావడంతో ఇంటి నుంచి పారిపోయింది.
గౌహతి: ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టింది. (Woman Murder Husband) తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు స్థానికులకు చెప్పింది. అయితే ఆమెపై అనుమానం రావడంతో ఇంటి నుంచి పారిపోయింది. అస్సాం రాజధాని గౌహతిలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల రహీమా ఖాతున్, 38 ఏళ్ల సబియాల్ రెహ్మాన్‌కు 15 ఏళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. గౌహతిలోని పాండు ప్రాంతంలోని జోయ్మతి నగర్లో వారు నివసిస్తున్నారు.
కాగా, జూన్ 26న రాత్రి వేళ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త సబియాల్ రెహ్మాన్‌ను, భార్య రహీమా ఖాతున్ కొట్టి చంపింది. ఆ తర్వాత ఇంటి ప్రాంగణంలో తవ్విన ఐదు అడుగుల లోతైన గోతిలో భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు అందరికి చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి పారిపోయింది.
మరోవైపు సబియాల్ రెహ్మాన్ అదృశ్యంపై అతడి సోదరుడు ఆందోళన చెందాడు. రహీమా ఖాతున్పై అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో జూలై 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె జూలై 13న ఆ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కుటుంబ కలహాల వల్ల జరిగిన గొడవలో తామిద్దరం కొట్టుకున్నట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన భర్త చనిపోయినట్లు చెప్పింది. భయపడిన తాను ఇంటి ఆరవణలో గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టినట్లు వివరించింది.
కాగా, సబియాల్ రెహ్మాన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ ఒక్కతే ఐదు అడుగుల గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టడంపై పోలీసులు అనుమానించారు. ఆమెకు ఇతర వ్యక్తులు సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసుపై మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Kills Son | హోటల్ రూమ్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తండ్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 5 Foot Pit
- Assam
- buryed
- Husband
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

