బెంగళూరు: పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో మరింత చికెన్ వడ్డించాలని ఒక వ్యక్తి అడిగాడు. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన ఫ్రెండ్ అతడ్ని కత్తితో పొడిచి చంపాడు. (Man Stabs Friend To Death) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అభిషేక్ కొప్పాడ్కు ఇటీవల పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం అతడి ఫార్మ్ హౌస్ వద్ద స్నేహితులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు.
కాగా, 30 ఏళ్ల వినోద్ మలశెట్టి ఈ పార్టీలో పాల్గొన్నాడు. అతడి ఫ్రెండ్ విట్టల్ హరుగోప్ అందరికి ఫుడ్, చికెన్ వడ్డించాడు. అయితే తనకు తక్కువగా చికెన్ వడ్డించినట్లు వినోద్ ఆరోపించాడు. మరింత కావాలని అడిగాడు. ఇది వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహించిన విట్టల్ ఉల్లిపాయలు కోసేందుకు వినియోగించిన కత్తితో వినోద్‌ను పొడిచాడు. అధిక రక్తస్రావం వల్ల అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?
Man Kills Son | హోటల్ రూమ్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తండ్రి