పాట్నా: బ్రిటీష్ వారు గాంధీజీని ఆపినట్లు తనను ఆపారని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) ఆరోపించారు. గ్రామ సభ నుంచి ఆయనను బహిష్కరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తుర్కౌలియా గ్రామానికి తుషార్ గాంధీ చేరుకున్నారు. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు మద్దతుగా సోమవారం పాదయాత్రలో పాల్గొన్నారు.
కాగా, 1971 ఏప్రిల్ 10న తొలి రాజకీయ ఉద్యమాన్ని చంపారన్ జిల్లాలో గాంధీజీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నాడు గాంధీ బస చేసిన భితిహర్వాలోని ఆశ్రమం నుంచి గ్రామంలోని వేప చెట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ సభ జరిగింది.
మరోవైపు తుషార్ గాంధీ ప్రసంగిస్తుండగా గ్రామ పెద్ద వినయ్ సాహ్ అడ్డుకున్నారు. సీఎం నితీశ్ కుమార్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. తుషార్ గాంధీని ‘కాంగ్రెస్ బానిస’ అని విమర్శించారు. సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ నుంచి ఆయన వెళ్లిపోయారు.
అనంతరం ఈ సంఘటనపై తుషార్ గాంధీ స్పందించారు. చంపారన్‌లో ప్రజాస్వామ్యం ‘హత్య’కు గురైందని ఆరోపించారు. తన ముత్తాత మాదిరిగానే తనను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్రిటీష్ వారు పాలించినప్పుడు గాంధీజీని కూడా ఆపారు. నేడు మమ్మల్ని కూడా అదే విధంగా ఆపారు. నేను భయపడను’ అని అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రామ పెద్దను గాంధీని హత్య చేసిన గాడ్సే వారసుడని తుషార్ గాంధీ విమర్శించారు.
“Nitish & Modi have worked for the poor. All are progressing. You are Gandhi’s dynast? GET OUT.
~ SHAME ON You. You’re here for Politics.”😭Congress slave Tushar Gandhi kicked out of the Panchayat Bhavan by locals. Proper BELT TREATMENT 😹🔥 pic.twitter.com/sBPFK5lvRT
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 14, 2025
Also Read:
Ink Attack On Maratha Leader | మరాఠా సంస్థ నేతపై సిరా దాడి.. బీజేపీ నేత ప్రమేయంపై ఆరోపణలు
Akasa Air plane | ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగాన్ని ఢీకొట్టిన కార్గో వాహనం