ముంబై: ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానాన్ని (Akasa Air plane) కార్గో వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ విమానం వెనుక భాగం వైపు ఉన్న రెక్క దెబ్బతిన్నది. దీంతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని తనిఖీ చేస్తున్నది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఎయిర్‌పోర్ట్‌లో నిలిచి ఉన్న ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగాన్ని కార్గో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఒంగిన ఆ రెక్క వాహనంలోకి చొచ్చుకెళ్లింది.
కాగా, దెబ్బతిన్న ఆ రెక్క భాగాన్ని పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు. థర్డ్ పార్టీ గ్రౌండ్ హ్యాండ్లర్ వల్ల జరిగిన ఈ ప్రమాదం వల్ల ఎంత నష్టం జరిగిందో అన్నది అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్
Ink Attack On Maratha Leader | మరాఠా సంస్థ నేతపై సిరా దాడి.. బీజేపీ నేత ప్రమేయంపై ఆరోపణలు
Watch: ఒడిశాలో మరో అమానుషం.. మరో జంటను నాగలికి కట్టి దున్నించిన వైనం