NIT Warangal | నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ జోష్ .. సందడి చేసిన ‘స్వయంభు’ చిత్ర బృందం..!
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో స్ప్రింగ్‌స్ప్రీ జోష్ మొదలైంది. పలురకాల సాంస్కృతికి కార్యక్రమాలు, ఈవెంట్లతో విద్యార్థులు ఆకట్టుకోగా.. 'స్వయంభు' చిత్ర బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో స్ప్రింగ్‌స్ప్రీ జోష్ మొదలైంది. పలురకాల సాంస్కృతికి కార్యక్రమాలు, ఈవెంట్లతో విద్యార్థులు ఆకట్టుకోగా.. ‘స్వయంభు’ చిత్ర బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా మా మాస్టర్ క్లాస్‌లు, ప్రముఖులతో సంభాషణలు, సాహిత్య కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు.. ఇలా విభిన్న అంశాలతో తొలిరోజు మేధస్సు, సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది. రోజంతా ఆసక్తిని రేకెత్తించిన ముఖ్య సెషన్లలో ఒకటి ‘డైరెక్టర్స్స్ కట్’. హిట్ ఫ్రాంచైజ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సైలేష్ కొలను పాల్గొన్నారు.
డైరెక్టర్స్ కట్లో భాగంగా.. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు శైలేశ్ కొలను బదులిచ్చారు. సినిమాటిక్ యూనివర్స్ నిర్మాణంలో సృజనాత్మక ప్రక్రియ, బహుళస్థాయి కథనం, సస్పెన్స్ ఆధారిత నిర్మాణ శైలి, థ్రిల్లర్ జానర్లో పాత్రల రూపకల్పన కళాత్మక దృష్టి, వాణిజ్య విజయం మధ్య సమతుల్యత స్క్రీన్ రైటింగ్, నిర్మాణంలో క్రమశిక్షణ అవసరమని దర్శకుడు తెలిపారు. ప్రశ్నోత్తర సెషన్లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని, దర్శకత్వం, కథా రచన, ఫిల్మ్ టెక్నాలజీ, వినోద రంగంలో కెరీర్ అవకాశాలపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ సెషన్ ఒక విలువైన మాస్టర్ క్లాస్‌గా మారింది.
‘స్వయంభు’ బృందం సందడి
త్వరలో విడుదల కానున్న ‘స్వయంభు’ చిత్ర బృందం నిట్ క్యాంపస్‌లో సందడి చేసింది. హీరో నిఖిల్ సిద్ధార్థ, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినవ్ గోమటం, కేకే సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో జరిగిన ఇంటరాక్షన్‌లో పెద్దస్థాయి చిత్ర నిర్మాణ ప్రక్రియపై లోతైన చర్చ జరిగింది.
ముఖ్యంగా నటనలో భావోద్వేగాల లోతు, సినిమాటోగ్రఫీ సాంకేతిక సవాళ్లు, విజువల్ స్టోరీ టెల్లింగ్ పద్ధతులు, నటీనటులు, సాంకేతిక బృందం మధ్య సమన్వయం, భారతీయ సినిమాకు అంతర్జాతీయల్ స్థాయిలో పెరుగుతున్న అవకాశాలు ఈ సెషన్‌ను ప్రత్యేకంగా ఆకర్షించాయి.
ఆకట్టుకున్న విద్యార్థుల ఈవెంట్లు..
స్ప్రింగ్స్ప్రీలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ఈవెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. షార్ట్-ఫార్మ్ , మొబైల్-ఫస్ట్ మీడియా ధోరణులు, క్రియేటర్ ఎకానమీ, ఆదాయ నమూనాలు ఆలోచింపజేశాయి. డిజిటల్ యుగంలో మీడియా స్టార్టప్‌ల నిర్మాణం, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ విద్యార్థులకు సృజనాత్మక రంగాలలో అవకాశాలు, ఇది నూతన ఆవిష్కరణలు, బ్రాండింగ్, టెక్నాలజీ ఆధారిత మీడియా రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. సాహిత్య, నాటక, సాంస్కృతిక కార్యక్రమాలు స్ప్రింగ్స్ప్రీలో ఆకట్టుకున్నాయి. లిటరరీ అండ్ డిబేటింగ్ క్లబ్, ఓపెన్ మైక్ (హిందీ), కవిత్వం, కథనాలు, వ్యంగ్య ప్రదర్శనలు, స్పోకెన్ వర్డ్ ప్రదర్శనలతో విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరిచారు.
అన్ సాల్వ్డ్ (ఇంగ్లీష్)-మిస్టరీ ఆధారిత ఆలోచనాత్మక కార్యక్రమం-తర్కశక్తి, విశ్లేషణా నైపుణ్యాలను పరీక్షించింది. థియేటర్, ప్రదర్శన కళలు, నుక్కడ్ నాటక్, సామాజిక అంశాలపై వీధి నాటకం-విద్యార్థుల్లో చైతన్యం కలిగించింది. తక్కువ సమయంలో కథను రూపొందించి ప్రదర్శించే సృజనాత్మక నాటక పోటీ డైరెక్టర్స్ స్కిడ్, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, ట్రెజర్ హంట్, క్యాంపస్ అంతటా జట్టు భావన, విశ్లేషణా నైపుణ్యాలను పరీక్షించిన పోటీలు, నేచర్ అండ్ విలువల అవగాహన సెషన్, పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువలపై అవగాహన, సంగీత, వినోదం, కరాకే నైట్‌లో భాగంగా విద్యార్థుల గాన ప్రదర్శన ఉత్సాహభరితంగా కొనసాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!



