NZ vs ENG : సెమీస్‌పై గురి పెట్టిన న్యూజిలాండ్ శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయింది. పవర్ ప్లేలోనే దంచేసి 56 రన్స్ పిండుకున్న ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(35), ఫిన్ అలెన్(29) ఔటయ్యాక.. మిడిలార్డర్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్లు చుట్టేశారు. ఆదిల్ రషీద్(2-28), విల్ జాక్స్(2-23) తిప్పేయగా.. కివీస్ హిట్టర్లు తోకముడిచారు. సారథి మిచెల్ శాంట్నర్(9 నాటౌట్) చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపడంతో కివీస్ జట్టు ఇంగ్లండ్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
నాకౌట్లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ చివరి పోరులో న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేసింది. 180 ప్లస్ కొట్టేలా కనిపించిన కివీస్‌ను.. స్పిన్ ఉచ్చులో పడేసి 159కే నిలువరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(35), ఫిన్ అలెన్(29)లు అదిరే ఆరంభమిచ్చారు. తొలి ఓవర్లో సున్నా.. ఆ తర్వాత 9 రన్సే ఇచ్చిన జోఫ్రా ఆర్చర్‌కు చుక్కలు చూపిస్తూ సీఫర్ట్ వరుసగా 4, 4, 6 బాదాడు. ఫలితంగా పవర్ ప్లేలోనే 56 రన్స్ పిండుకున్నారిద్దరు.
Glenn Phillips top scores with 39 as regular wickets from England’s spin attack keep New Zealand under 160 – will it be defendable?
Follow the chase: https://t.co/DQCGNKfRPk pic.twitter.com/82hmwa4QV3
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు వెంటనే ఆదిల్ రషీద్‌కు బంతి అప్పగించిన బ్రూక్ ఫలితం రాబట్టాడు. సిక్సర్ బాదిన సీఫర్ట్.. మరో పెద్ద షాట్ ఆడేక్రమంలో బంతిని మిస్ అవ్వగా.. బట్లర్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. దాంతో.. తొలి వికెట్ 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే జాక్స్ ఓవర్లో అలెన్ సైతం బెథెల్ చేతికి దొరికాడు. వెంట వెంటనే రెండు వికెట్లు పడిన వేళ.. రచిన్ రవీంద్ర(11), గ్లెన్ ఫిలిప్స్(39)లు.. నిలదొక్కుకున్నారు. మూడో వికెట్‌కు 31 రన్స్ రాబట్టిన రవీంద్రను రెహాన్ బోల్తా కొట్టించాడు.
Jacks turns it past Phillips and rattles the stumps! 🎯
Santner and McConchie reunite in the middle after their heroics against Sri Lanka – New Zealand 135/6 with 17 balls to gohttps://t.co/dLKzTVuugj | #T20WorldCup pic.twitter.com/d0mMRsg7Te
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
అనంతరం చాప్మన్(15) జతగా ఫిలిప్స్ బౌండరీలతో వేగం పెంచాడు. కానీ, డ్రింక్స్ బ్రేక్ తర్వాతి బంతికే చాప్‌మన్‌ను బట్లర్ స్టంపౌట్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు. ఫామ్‌లో లేని డారిల్ మిచెల్(3)ను డాసన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. రెహాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శాంట్నర్(9 నాటౌట్) సిక్సర్ బాదగా.. నిర్ణీత ఓవర్లలో బ్లాక్‌క్యాప్స్ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.