ముంబై: మహారాష్ట్రకు చెందిన మరాఠా సంస్థ సంభాజీ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గైక్వాడ్‌పై నల్ల సిరాతో దాడి జరిగింది. ఆదివారం సోలాపూర్ జిల్లా అక్కల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. (Ink Attack On Maratha Leader) ప్రవీణ్ గైక్వాడ్ తల, ముఖంపై నల్ల సిరా పోశారు. ‘జై భవానీ, జై శివాజీ’ వంటి నినాదాలు చేశారు. కారు ఎక్కిన ఆయనను బలవంతంగా బయటకు లాగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు సిరా పోసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సిరా దాడి జరిగినప్పటికీ ప్రవీణ్ గైక్వాడ్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివవ్యాఖ్యాతక్ శివరత్న షెటే బిరుదుతో ఆయనను సత్కరించారు. పంధర్పూర్లోని శంభాజీ బ్రిగేడ్ సభ్యులు ప్రవీణ్ గైక్వాడ్‌ను పాలతో స్నానం చేయించారు. తనపై కుట్ర, హత్యాయత్నం జరిగిందని అనంతరం ఆయన ఆరోపించారు. కార్యక్రమం వద్ద పోలీసులు లేకపోవడం, భద్రతా లోపానికి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై తగిన సమయంలో స్పందిస్తానని అన్నారు.
మరోవైపు ‘సంభాజీ బ్రిగేడ్’ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్న శివధర్మ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులు ప్రవీణ్ గైక్వాడ్‌పై సిరాతో దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఆ సంస్థ ఇందాపూర్ అధ్యక్షుడు, బీజేపీ యువ మోర్చా కార్యదర్శి దీపక్ కేట్ ఈ బృందాన్ని లీడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు.
लेटेस्ट विडिओ आला रे पोरानो
बघा बघा कस तुडवत आहे 😂😂🚩
वाह रे माझ्या मर्द मराठ्यानो , गाजलात वाघानो गाजलात🚩💪🏻🔥
आज शिवछत्रपतीना तुमचा अभिमान वाटला
असेल 🚩🙏🏻मराठा गर्जतोय🔥🔥💪🏻🚩#PravinGaikwad #SambhajiBrigade pic.twitter.com/gODXir2RCU
— RobinHood🇮🇳 (@therobinhoodz) July 13, 2025
Also Read:
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్