హైదరాబాద్ : నార్వేలోని హోస్లో నగరంలో బీఆర్ఎస్ నార్వే శాఖ ప్రతినిధులు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ చిన్న నగరంలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికి తెలంగాణ మిత్రులు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ఎంతో చురుకుగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. 2017లో తాను నార్వేకు వచ్చినప్పుడు ఈ శాఖను ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు.
గత పది సంవత్సరాలుగా ప్రతినిధులు ఎంతో నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల నుంచి బీఆర్ఎస్కు మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ప్రసాద్ రావు బిక్కినేని, శ్రీకాంత్ రెడ్డి గడ్డం, నాగభూషణ్ గంగం, రాము వెల్మ, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.