యాదగిరిగుట్ట, జూలై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బాహుపేట స్టేజీ వద్ద ఘన స్వాగతం లభించింది. గురువారం వరంగల్‌కు వెళ్తున్న ఆయనకు మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె కేటీఆర్‌కు స్వామివారి శెల్లా కప్పి ప్రసా దం అందజేశారు. అనంతరం ఆమె కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రామిరెడి, బొట్ల పరమేశ్, సర్పంచ్ కవిడె మహేందర్, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, పైళ్ల సత్యనారాయణరెడ్డి, రమేశ్, ముక్యర్ల సతీశ్, మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేత చింతల
భువనగిరి అర్బన్ జూలై 23: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వరంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో భువనగిరి పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు మార్గంలో బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేటీఆర్‌ను కలిశారు. భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, అమరేందర్, జనగాం పాండు, నీల ఓంప్రకాశ్ గౌడ్, సుబ్బూరు మల్లయ్య, పుట్ట వీరేశ్, సందెల సుధాకర్, కుతాడి సురేష్, పోల ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
కేటీఆర్‌కు వినూత్నంగా బర్త్‌డే విషెస్
మిర్యాలగూడ, జూలై 23: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను మిర్యాలగూడలో గురువారం ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్ ఆధ్వర్యంలో పచ్చని వరిమొక్కలతో ‘కేటీఆర్’ అనే పేరు వచ్చేలా నాట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు, వ్యవసాయ రంగానికి కేటీఆర్ చేసి న సేవలకు గుర్తుగా పొలంలో ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ వీర నాయక్, టీఆర్ఎస్వీ ప్రతినిధులు మహేష్ నాయుడు, చిన్నాల అంజి యాదవ్, శ్రీధర్ నాయక్, గయాస్, అఖిల్, సురేష్ యాదవ్, నాగార్జున నాయక్, శ్రీధర్, మణి, మహేష్ నాయక్, అసాద్, జిత్తు, బబ్లు, అమన్ పాల్గొన్నారు.