న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ పండుగ బొనాంజాను ప్రకటించింది. అక్టోబర్ నెలలో నెక్సా షోరూంలో లభించే అన్ని రకాల మాడళ్లపై రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నది. వీటలో నగదు రూపంలో, ఎక్సేంజ్ బోనస్ కింద, లాయల్టీ కింద కలుపుకుని మొత్తంగా లక్ష రూపాయలకు పైగా రాయితీని ఇస్తున్నది.
వీటిలో గ్రాండ్ విటారాపై అత్యధికంగా రూ.1.36 లక్షల వరకు అందిస్తున్న సంస్థ.. డెల్టా పెట్రోల్ వెర్షన్‌పై రూ.1.26 లక్షలు, ఎక్స్ఎల్6పై రూ.61 వేలు, జిన్నీ మాడల్‌పై రూ.35 వేలు, ఈ-విటారాపై రూ.95 వేలు, ఫ్రాంక్స్‌పై రూ.27,100 చొప్పున రాయితీని ఇస్తున్నది.