భోపాల్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఖర్గోన్-బర్వానీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ యువత ఒక్కొక్కరు ఐదుగురు పిల్లల్ని కనాలని తెలిపారు. ప్రస్తుతం దేశంలో జన్మిస్తున్న పిల్లల్లో నలుగురిలో ఒక్కరు మాత్రమే హిందూ సమాజానికి చెందిన వారని.. మిగతా ముగ్గురు వేరే వర్గానికి చెందిన వారని పేర్కొన్నారు. ప్రస్తుతం పుడుతున్న పిల్లల్లో 1.9 శాతం మాత్రమే సనాతన సమాజానికి చెందిన వారని, మిగతా 2.9 వేరే వర్గాలకు చెందిన వారని గజేంద్ర సింగ్ వెల్లడించారు. దేశంలో సనాతన వర్గం తగ్గిపోతున్నదని.. కాబట్టి హిందూ యువత తక్కువ వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మందిని కనాలన్నారు.