మాట నిలబెట్టుకున్న కేటీఆర్
మాట ఇవ్వడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగ నిరుపేద మరుగుజ్జు యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల కోసం నర్సంపేట నుంచి గూడూరు మీదుగా మహబూబాబాద్‌కు వెళ్తున్న కేటీఆర్ కొద్దిసేపు గూడూరు మండల కేంద్రంలో ఓ టీ స్టాల్ వద్ద ఆగారు.
- నిరుద్యోగ మరుగుజ్జు యువకుడి జీవితంలో వెలుగులు
- కేటీఆర్ పుట్టిన రోజున వినోద్‌కు గిఫ్ట్
- గిఫ్ట్ ఏ స్మైల్ కింద రూ.2లక్షల చెక్కు అందజేసిన వినయ్‌భాస్కర్
గూడూరు/ హనుమకొండ, జూలై 23 : మాట ఇవ్వడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగ నిరుపేద మరుగుజ్జు యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల కోసం నర్సంపేట నుంచి గూడూరు మీదుగా మహబూబాబాద్‌కు వెళ్తున్న కేటీఆర్ కొద్దిసేపు గూడూరు మండల కేంద్రంలో ఓ టీ స్టాల్ వద్ద ఆగారు. ఇంతలో వినోద్ అనే నిరుద్యోగ మరుగుజ్జు యువకుడు కేటీఆర్‌ను చూసేందుకు ఆయన కాన్వాయ్ వెంట వచ్చాడు.
గమనించిన కేటీఆర్ వినోద్‌ను పరిచయం చేసుకున్నారు. ఏం చేస్తున్నావ్ వినోద్ అని అడిగి తెలుసుకున్నారు. తాను మరుగుజ్జునని, తనకు కిరాణా షాపు పెట్టుకునేందుకు ఆర్థిక ఇబ్బందిపడుతున్నానని తెలుపడంతో వెంటనే, తాను రూ.2 లక్షలు ఇస్తానని, వాటితో కిరాణా షాపు పెట్టుకొని నడుపుకోవాలని సూచించారు. కాగా, గురువారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా హన్మకొండ జిల్లా కాజీపేటకు వచ్చిన కేటీఆర్ వినోద్‌ను పిలిపించి రూ.2 లక్షల చెక్కు అందజేయడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని దాస్యం వినయ్‌భాస్కర్ గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు.
అందులో భాగంగా వినోద్ కిరాణా షాపు పెట్టుకునేందుకు రూ. 2లక్షల సహాయం వినోద్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ నమస్తే తెలంగాణతో తన జీవితాన్ని నిలబెట్టిన కేటీఆర్సారును తాను, తన కుటుంబం జీవితాంతం గుర్తు పెట్టుకుంటుదని కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మాట ఇచ్చి నిలబెట్టుకున్న కేటీఆర్‌కు మాజీ ఎంపీ కవిత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు భరత్‌కుమార్‌రెడ్డి, బానోత్ రవికుమార్, మండల మాజీ అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, వేం మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

