Ram Charan | మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే అంతకుముందే ‘పునాది రాళ్లు’ చిత్రంలో కెమెరా ముందుకు వచ్చినప్పటికీ, ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సందర్భంగా చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.48 ఏళ్ల సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు ముఖ్యంగా అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో పాత్రలు పోషించానని, అనేక విజయాలు అందుకున్నానని, అవార్డులు, గౌరవాలు పొందానని గుర్తుచేసుకున్నారు. అయితే వాటన్నింటికంటే అభిమానులు తనపై చూపించిన ప్రేమ, వారి హృదయాల్లో తనకు ఇచ్చిన స్థానం ఎంతో విలువైనవని చిరంజీవి పేర్కొన్నారు.
1978 సెప్టెంబర్ 22న మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయాలు, అవార్డులు, గౌరవాల కంటే తనపై అభిమానులు చూపించిన ప్రేమే తనకు గొప్పదని తెలిపారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఇంతటి ప్రేమాభిమానాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ‘చిరంజీవి’ అనే పేరును తాను పెట్టుకున్నప్పటికీ, దానికి శాశ్వతమైన గుర్తింపు అభిమానుల ప్రేమ వల్లే వచ్చిందని పేర్కొన్నారు.
ఇక తండ్రి చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానంపై రామ్ చరణ్ కూడా భావోద్వేగంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.నాన్నా.. మీరు సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి 48 ఏళ్లు పూర్తయ్యాయి. మీ జీవితాన్ని, మన కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసిన ఆ రోజు గురించి మేము ప్రతిరోజూ తలచుకుంటూనే ఉంటాము అంటూ రామ్ చరణ్ తన సందేశాన్ని ప్రారంభించారు. చిరంజీవి సినీ ప్రయాణానికి ప్రేక్షకులు అందించిన ప్రేమ, మద్దతుకు తాను ఎంతో రుణపడి ఉంటానని చరణ్ తెలిపారు. తండ్రి సినీ ప్రస్థానం తమ కుటుంబానికి మాత్రమే కాకుండా తనకు కూడా ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సినీ రంగంలో చిరంజీవి సాధించిన ఈ మైలురాయి 50 ఏళ్లకు చేరుకునే వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చరణ్ చెప్పడం విశేషం.
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will… https://t.co/C8DMJ4L4Vp
— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2026