పాతాళంలోకి జలం!
మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్‌లో 8.5 ఎం.ఎం, అల్లాదుర్గలో 7.4ఎం.ఎం, టేక్మాల్‌లో 10.1ఎం.ఎం, పాపన్నపేటలో 10.8 ఎం.ఎం, హవేళిఠఘనపూర్లో 9.5 ఎం.ఎం, రామాయంపేటలో 9 ఎం.ఎం, చేగుంటలో 9.9 ఎం.ఎం, నిజాంపేటలో 13.9 ఎం.ఎం, చిన్నశంకరంపేటలో 8.6 ఎం.ఎం, మెదక్‌లో 17 ఎం.ఎం, కొల్చారంలో 8.4 ఎం.ఎం, చిలిపిచెడ్‌లో 7 ఎం.ఎం, కౌడిపల్లిలో 6.8 ఎం.ఎం, నర్సాపూర్‌లో 6.4 ఎం.ఎం, శివ్వంపేటలో 8.7 ఎం.ఎం, వెల్దుర్తిలో 7.7 ఎం.ఎం, తూప్రాన్‌లో 10.2 ఎం.ఎం, మాసాయిపేటలో 7.9ఎం.ఎం, మనోహరాబాద్‌లో 5.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
- మెదక్ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- తాగు, సాగునీటి కొరత
- నార్సింగి మండలంలో అత్యధికంగా 26.18 మీటర్ల లోతుకు నీరు
- చేగుంటలో కనిష్ఠంగా 9.11 మీటర్ల వద్ద భూగర్భ జలాలు
- ఈసారి ఒక్క భారీ వాన పడలే..
మెదక్, జూలై 23(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్‌లో 8.5 ఎం.ఎం, అల్లాదుర్గలో 7.4ఎం.ఎం, టేక్మాల్‌లో 10.1ఎం.ఎం, పాపన్నపేటలో 10.8 ఎం.ఎం, హవేళిఠఘనపూర్లో 9.5 ఎం.ఎం, రామాయంపేటలో 9 ఎం.ఎం, చేగుంటలో 9.9 ఎం.ఎం, నిజాంపేటలో 13.9 ఎం.ఎం, చిన్నశంకరంపేటలో 8.6 ఎం.ఎం, మెదక్‌లో 17 ఎం.ఎం, కొల్చారంలో 8.4 ఎం.ఎం, చిలిపిచెడ్‌లో 7 ఎం.ఎం, కౌడిపల్లిలో 6.8 ఎం.ఎం, నర్సాపూర్‌లో 6.4 ఎం.ఎం, శివ్వంపేటలో 8.7 ఎం.ఎం, వెల్దుర్తిలో 7.7 ఎం.ఎం, తూప్రాన్‌లో 10.2 ఎం.ఎం, మాసాయిపేటలో 7.9ఎం.ఎం, మనోహరాబాద్‌లో 5.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం పడడంతో మొక్కలకు ప్రాణం వచ్చింది. పత్తి, మొక్కజొన్నతో పాటు పలు పంటలకు జీవం పోసింది.
బోరుబావుల పైనే ఆధారం
వానకాలం ప్రారంభమై 40 రోజులు గడిచినా జిల్లాలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆయా మండలాల్లో భూగర్భజలాలు తగ్గిపోవడంతో సాగు, తాగు నీటి సమస్య నెలకొన్నది. జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లో నీరు చేరలేదు. దీంతో రైతులు బోరుబావులపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.
అత్యధిక లోతులో నీరు ఉన్న మండలాలు..
నార్సింగ్‌లో 26.18 మీటర్లు, మాసాయిపేటలో 18.25, కొల్చారంలో 17.53, కౌడిపల్లిలో 17.22, అల్లాదుర్గంలో 16.88, నర్సాపూర్ 16.43, రామాయంపేట 16.05 మీటర్ల లోతులో నీరు ఉందని భూగర్భజల శాఖ నిపుణులు తెలిపారు. చేగుంటలో 9.11 మీటర్లు, శివంపేటలో 9.39, వెల్దుర్తిలో10.01, తూప్రాన్‌లో 12.01, మెదక్‌లో 11.84 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 13.45 మీటర్ల లోతులో ఉంది. అనేక మండలాల్లో జలమట్టం15 మీటర్ల దిగువకు పడిపోయింది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 2025 జూలైలో 14.16 మీటర్లు ఉండగా 2026 జూలై మొదటి వారంలో 13.45 మీటర్లు నమోదైంది. ఈ నెలలో భారీ వర్షాలు కురవక పోతే సాగు సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

