రాయపోల్ మార్చి 10. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్ సత్తు అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో పాఠశాలకు ప్రహరీ గోడ లేదని. ప్రస్తుతం పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడంతో సమస్యకు పరిష్కారం లభించిందని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా బోధనపై దృష్టి పెట్టాలని, చిన్న పాఠశాల అయినప్పటికీ చదువులో మండలంలో ముందుండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు.
అనంతరం గ్రామపంచాయతీ పరిసరల పరిశుభ్రతపై గ్రామ పంచాయతీ కార్యదర్శి తో పాటు పంచాయతీ సిబ్బందితో మొక్కలను పెంచే నర్సరీని పరిశీలించి వివిధ రకాల మొక్కలను పెంచాలని వచ్చే వర్షాకాలంలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామస్తుల సమిష్టి సహకారంతో తిమ్మక్కపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.